![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -364 లో.. శకుంతల జైలర్ ఫోన్ కి కాల్ చేసి ప్రభాకర్ తో మాట్లాడుతుంది. జైలులో ఎవరితోనో గొడవ పడ్డావంట కదా అలా ఎవరితోనూ గొడవ పడకని శకుంతల చెప్తుంది. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు.. బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని ప్రభాకర్ చెప్తాడు. నువ్వేం బాధపడకు చిన్నమ్మ.. ఎలాగూ చిన్నాన్న వారం రోజుల్లో బయటకు వచ్చేస్తాడు కదా అని ముకుంద అంటుంది.
ఆ తర్వాత ముకుంద పూర్తిగా మారిపోయింది అనేలాగా తన మాటతీరు ఉంటుంది. ఈ సంక్రాతిని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని ముకుంద హుషారుగా మాట్లాడుతుంటుంది.కానీ మధుకి మాత్రం ఎక్కడో చిన్న డౌట్ ముకుంద నటిస్తుందని. మరొకవైపు కృష్ణ మురారి ఇద్దరు ఆదర్శ్ గురించి కనుక్కోవడానికి బయటకు వెళ్తారు. ఆదర్శ్ గురించి చెప్పడానికి మెహత అనే పర్సన్ వచ్చి.. కృష్ణ, మురారీలని కలిసి నేను తన గురించి కనుకొని మీకు చెప్తానని వెళ్ళిపోతాడు. కాసేపటికి నాకు చలి గా ఉందని మురారిని స్వెటర్ కొనివ్వమని కృష్ణ అడుగుతుంది. మురారి స్వెటర్ కొనిస్తాడు. మరొకవైపు భవానిని చూసి.. అక్క తప్పుకి సపోర్ట్ చేసినందుకు గిల్టీగా ఫీల్ అవుతుంది. అక్కని అడిగాకనే పంతులుకి ఫోన్ చేస్తాను. లేదంటే తనని పక్కన పెట్టామని ఫీల్ అవుతుందని రేవతి అనుకొని భవాని దగ్గరకి వస్తుంది.
నాపై నీకు కోపంగా లేదా అని రేవతిని భవాని అడుగుతుంది. లేదు అక్క మీరు తప్పుని నిజం అనుకొని భ్రమపడ్డారు అంతేనని రేవతి చెప్పగానే.. భవాని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కృష్ణ, మురారిల అగ్రిమెంట్ పెళ్ళిని పర్మినెంట్ చెయ్యలని మురారి అన్నాడని చెప్పారు కదా పంతులు గారిని పిలువమంటారా అని రేవతి అంటుంది. వాళ్ళ బంధాన్ని శాశ్వతం చేద్దామని భవాని అనగానే రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు చలిలో ఐస్ క్రీమ్ కావాలని కృష్ణ అనగానే.. మురారి నవ్వుకుంటాడు. ఆదర్శ్ పని మీద బయటకు వస్తే స్వెటర్ అంటుంది. ఐస్ క్రీమ్ అంటుంది.. ఇందుకే నాకు కృష్ణ నచ్చిందని మురారి అనుకుంటాడు.. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |